A son and his mom

ఒక కుమారుడు తన తల్లిని తీసుకుని ఓ రెస్టారెంటుకు వెళ్ళాడు……తల్లి చాలా
వృద్ధురాలు. బోజనాన్ని ఆర్డరుచేశాడు…..భోజనం వచ్చింది…ఆ తల్లి చాలా
బలహీనంగా ఉండటంవల్ల ఆహారాని మీదపోసుకుని…..కిందపోసి కాస్త ఇబ్బందికరంగా తినసాగింది… చుట్టు పక్కలవారు ఆమె తింటున్న తీరును
చూసి గుసగుసలాడుకోసాగారు.
కానీ, ఆ కొడుకు మాత్రం ఏ మాత్రం విసుక్కోకుండా ఆమె తినేదాక కూర్చోని
ఆమె తిన్న తరువాత తనను జాగ్రత్తగా తీసుకునివెళ్ళి …..చేతులు,,,,మొహం
శుభ్రంచేసి ఆమె బట్టలపై పడ్డ పదార్థాలను తుడిచి ….తలను ప్రేమగా దువ్వి……
బిల్లు కట్టి తల్లిని జాగ్రత్తగా తీసుకునివెళుతుండగా.. ఓ వ్యక్తి ఇలా అడిగాడు……
” బాబూ! నువ్వు ఇక్కడ ఏదో వొదిలేసి వెళుతున్నావు చూడు ” అన్నారు.
ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకుని ” నేను ఏమీ వదిలి వెళ్ళడంలేదే ” అన్నాడు.
ఆ వ్యక్తి ” నీవు ఎంతో విలువైన విషయాన్ని ఇక్కడ మాకోసం వదిలివెళుతున్నావు
నాయనా! ప్రతి ఒక్కరూ నీలానే తన తల్లిదండ్రులను చూసుకోవాలి.
అసహ్యించుకోకుండా ఓ బి్డ్డలా చూసుకోవాలన్న ఓ మంచి సందేశాన్ని
మాకు వొదిలివెళుతున్నావు ”
ఆ కొడుకు నవ్వుతూ అమ్మ నుదుటిని ముద్దాడుతూ భుజాలమీద చేయివేసి
తల్లిని తీసుకెళ్ళసాగాడు……
తల్లిదండ్రులను పసిపిల్లల్లా కాపాడుకోవాలి……ముసలితనంలో వారిని అతి
జాగ్రత్తగా చుసుకో్గలిగిన వారే నిజమైన బిడ్డలు కదా! …..:
ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను …

నాస్తి మాతృ సమం దైవం.

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తి మాతృ సమో గురుః

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు.

తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు.

ఆకలేసినా.. ఆనందం వేసినా, దిగులేసినా , దుఃఖం ముంచుకొచ్చినా , పిల్లలకైనా, పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా గుర్తొచే పదం అమ్మ.

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ కనుపాప లా కాపాడండి. ఒక్కసారి ఆలోచించండి……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *